7.11.25

విజ‌య‌వంతంగా శ్రీ‌వారి సారె ట్ర‌య‌ల్ ర‌న్ trail run





తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌లో చివ‌రి రోజైన న‌వంబ‌రు 25న పంచ‌మీ తీర్థం సంద‌ర్భంగా తిరుమ‌ల నుండి వ‌చ్చే శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ గురువారం విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.


తిరుప‌తిలోని చెన్నారెడ్డి కాల‌నీలో గ‌ల శ్రీ వినాయ‌క స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ మొద‌లైంది. అక్క‌డి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముందుగా శ్రీ కోదండ‌రామాల‌యం, చిన్న‌బ‌జారు వీధి, పాత హుజుర్ ఆఫీస్‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయం, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బండ్ల వీధి, ఆర్‌టిసి బ‌స్టాండు, ప‌ద్మావ‌తి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డి నుండి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల మండ‌పానికి సారెను వేంచేపు చేశారు.

టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ‌మ‌తి విఆర్ శాంతి, ఎస్ఇ శ్రీ మ‌నోహ‌ర్‌, విజివో శ్రీ గిరిధ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments