5.11.25

తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష ttd jeo review









తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల  (నవంబర్ 17 నుండి 25వ తేదీ ) ఏర్పాట్లపై తిరుచానూరు ఆస్థాన మండపంలో మంగళవారం టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.


అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం కంటే ఈసారి భక్తులకు ఇంకా మెరుగైన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు.

తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ . సుబ్బరాయుడు మాట్లాడుతూ పంచమీ తీర్థం రోజు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తిరుచానూరుకు వచ్చే రోడ్లపై హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

టీటీడీ సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ హోల్డింగ్ ఏరియాస్, వాహన మార్గాలు, పుష్కరిణి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్, ఈవోలు ఇచ్చిన సూచనల మేరకు బ్రహ్మోత్సవాలు మరింత ఘనంగా జరగే విధంగా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments