16.12.25

పీఏసీ–2ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ ttd chairman








టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్నాయుడు సోమవారం బోర్డు సభ్యులు శ్రీ శాంతారంశ్రీ నరేష్ కుమార్‌లతో కలిసి తిరుమలలోని యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం-2 (పీఏసీ–2)ను పరిశీలించారు.


 సందర్భంగా లాక‌ర్ల జారీ కేంద్రంకళ్యాణకట్టఅన్నప్రసాద విభాగాలను పరిశీలించి భక్తులతో మాట్లాడారు.


అనంత‌రం చైర్మ‌న్ త‌న‌ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైకుంఠ ఏకాదశి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.


భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత‌నిస్తూ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శ టోకెన్లను డిప్ ద్వారా కేటాయించామ‌ని చెప్పారు.


పీఏసీ–2లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారనిఅయితే సాధారణ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు.


 కార్యక్రమంలో ఈఈ శ్రీ వేణుగోపాల్డిప్యూటీ ఈవో (రిసెప్షన్) శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments