రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, టిటిడి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు డిసెంబర్ 22, 23 తేదీల్లో జరుగనున్నాయి.
శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 22వ తేదీ ఉదయం 8 గంటలకు క్రీడల ప్రారంభోత్సవం జరుగనుంది. 22, 23 తేదీలలో అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్ తదితర క్రీడల పోటీలు నిర్వహిస్తారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. పద్మావతమ్మ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

No comments :
Write comments