21.12.25

డిసెంబ‌రు 25న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం koil alwar tirumanjanam




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 25 తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుఆలయంలో డిసెంబ‌రు 30 తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా డిసెంబ‌రు 25 తేదీ తెల్లవారుజామున తిరుప్పావై స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహిస్తారుఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందిఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఅనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

No comments :
Write comments