9.12.25

డిసెంబ‌రు 30న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు kalayana venkateswara swamy vari temple




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 30 వైకుంఠ ఏకాదశి, 31 వైకుంఠ ద్వాదశి పర్వదినాల‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


డిసెంబ‌రు 30 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం నిర్వహిస్తారువేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారుసాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.


అదేవిధంగా డిసెంబ‌రు 31 వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం నిర్వహిస్తారుఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారుఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.


ఆంగ్ల నూత‌న సంవ‌త్స‌రాది 2026 జనవరి 1న‌ వేకువజామున 1 గంట నుండి 4 గంటల‌ వరకు ధనుర్మాస కైంకర్యాలుతోమాల సేవకొలువుపంచాంగ శ్రవణం నిర్వహిస్తారువేకువజామున 4 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారుసాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలుతిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.


 రెండు పర్వదినాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మికభక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

No comments :
Write comments