8.12.25

మనిషిని సన్మార్గం వైపు నడిపించే ఆయుధం భగవద్గీత : హెచ్డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్ • విజేతలకు బహుమతులు ప్రదానం bhagavad gita

 






మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని హెచ్డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ అన్నారుటిటిడిహిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఆదివారం ఉదయం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూఆధ్యాత్మిక కోణంలో మనిషి ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారుచెడు మీద మంచి విజ‌యం సాధించ‌డ‌మే గీతా సారాంశ‌మ‌న్నారుచిన్న వ‌య‌స్సులోనే భగవద్గీత శ్లోకాల‌ను శాస్త్ర‌బ‌ద్ధంగా ప‌ఠించ‌డందానిలోని సందేశం అర్థం చేసుకుంటే భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించవచ్చని తెలిపారు.


అనంతరం గీతా జయంతి వేడుకలలో మొదటి విభాగం నందు ప్రథమ బహుమతి 1కెపి శ్రీ ముకుంద,  ద్వితీయ హుమతి  కేపీ శ్రీ,  తృతీయ బహుమతి ఎం వైష్ణవి పొందారు


రెండవ విభాగంలో.... 

1. డి నిశాంత్ చక్రవర్తి 

2. ఎం జస్వంత్ 

3. ఎస్ నాగవేణి 


మూడవ కేటగిరీలో...

1. పీహెచ్ వెంకటనారాయణ 

2. ఎం లహరి 

3. ఎస్ ఉమామహేశ్వరి 

బహుమతులు గెలుపొందారు


విజేతలకు  హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ బహుమతులు ప్రదానం చేశారు.


ఏపీతెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలతోపాటుచెన్నైబెంగుళూరు నందు  గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్,  తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయిదాదాపు 8500 మంది బాలబాలికలు  పోటీల్లో పాల్గొన్నారు


అంతకుముందు శ్రీ ఆముదాల మురళిశ్రీ కేటివి రాఘవన్శ్రీమతి సునీత తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారున్యాయ నిర్ణేతలను హెచ్ డి పి పి కార్యదర్శి సన్మానించారు


 కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీ హెడ్డిపిపి ఏఈవో శ్రీ సిసత్యనారాయణప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీమతి కోకిలవిద్యార్థులువారి తల్లిదండ్రులుసిబ్బంది , ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments