23.12.25

శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనం HEREBAL GARDEN







కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుందిభారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔష మొక్కల సంరక్షణ లక్ష్యంగా తిరుమలలో టీటీడీ రూ.4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.


అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు జీవనాడిగా దివ్య ఔషధ వనం అభివృద్ధి


రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరుదైనఅంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్ ఔషధ వనాన్ని ఏర్పాటు చేసేందుకు టీటీడీ సంకల్పించిందిఔషధ మొక్కలను సంరక్షిస్తూప్రజలకు పరిచయం చేయడం  ప్రాజెక్టు ముఖ్య ద్దేశంతద్వారా పర్యావరణ పరిరక్షణజీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాలకు దివ్య ఔషధ వనం తోడ్పడనుందిదక్షిణ భారతదేశంలోనే  తరహాలో రూపొందనున్న  ఔషధ వనం భక్తులుపరిశోధకులువిద్యార్థులుప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యే ఆకర్షణగా నిలవనుంది.


భక్తివిజ్ఞానంప్రకృతి సమ్మేళనం


టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనంసుగంధ వనంపవిత్ర వనంప్రసాద వనంపూజా ద్రవ్య వనంజీవరాశి వనంకల్పవృక్ష ధామంఔషధ కుండ్ములికా వనంఋతు వనంవిశిష్ట వృక్ష వనంఔషధ మొక్కలు వంటి 13 కాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారుఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండాఔషధ విజ్ఞానంప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి.


రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో ఏర్పాటు


తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో  దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారువచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచిభక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన  ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలిపింది.

No comments :
Write comments