హైదరాబాద్
జూబ్లీహిల్స్ లోని టిటిడి శ్రీ ఎస్వీ ఆలయాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం పరిశీలించారు.
ముందుగా ఆలయం వద్దకు టిటిడి ఈవో చేరుకోగానే అధికారులు స్వాగతం పలికారు. ఆలయ పరిసరాల్లో పార్కింగ్ సమస్యపై స్థానిక ఎల్ ఏసీ ప్రెసిడెంట్ శ్రీ ఏవీ రెడ్డితో చర్చించారు. తిరుమల తరహాలో భక్తులకు రుచికరంగా, శుచికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే కుక్ లకు శిక్షణ ఇస్తామన్నారు. ఆలయంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా భక్తులను అడగడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
అంతకు ముందు హిమాయత్ నగర్ లోని ఎస్వీ ఆలయాన్ని టిటిడి ఈవో పరిశీలించారు. హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ ఆలయాల్లో భక్తులకు సరిపడ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ యు.రమేష్, ఇంజనీరింగ్ అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
No comments :
Write comments