5.12.25

శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం karthika deepostavam










తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించిందికార్తీ పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత  దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.


ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన  కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారుతదుపరి వీటిని ఛత్రచామరమంగళవాయిద్యాలతో రేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారుఆతర్వాత గర్భాలయంలో అఖండంకులశేఖర పడిరాములవారి మేడద్వార పాలకులుగరుడాళ్వారువరదరాజస్వామి సన్నిధివకుళమాతబంగారు బావికల్యాణ మండపంసభ అరతాళ్లపాక అరభాష్యకారుల సన్నిధియోగ నరసింహస్వామివిష్వక్సేనులుచందనం అర, పరిమళం అరవెండి వాకిలిధ్వజ స్తంభంబలిపీఠంక్షేత్ర పాలకుల సన్నిధితిరుమలరాయ మండపం, పూల బావిరంగ నాయక మండపంమహా ద్వారంబేడి ఆంజనేయస్వామిశ్రీవరాహస్వామి ఆలయంస్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.


శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు.


కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవసహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.


 కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామిటీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్బోర్డు సభ్యులు శ్రీమతి పనబా లక్ష్మిశ్రీమతి జానకి దేవి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డిశ్రీ నరేష్అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణడిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథంఇతర అధికారులుఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments