టిటిడి
స్థానిక ఆలయాలైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, నారాయణ వనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ రుక్విని సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి ఆలయాల్లో గురువారం సాయంత్రం కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
శ్రీ కోదండరామాలయంలో కార్తీక దీపోత్సవం
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో గురువారం సాయంత్రం కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. కాగా రాత్రి 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకొచ్చారు. ఆ తరువాత దీపోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి ఆస్థానం జరిగింది.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో....
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆస్థానం, ఆలయ నాలుగు మాడ వీధులలో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ..
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు.
No comments :
Write comments