తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..
- జనవరి 1 మరియు 28వ తేదీలలో రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
- జనవరి 2, 9, 16, 23, 30వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
- జనవరి 10న హస్తా నక్షత్రం మరియు జనవరి 15న సంక్రాంతి సందర్భంగా శ్రీ సూర్యనారాయణస్వామి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
- జనవరి 19న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంటలకు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
- జనవరి 25న రథ సప్తమి సందర్భంగా అమ్మవారు ఉదయం 7 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఏడు వాహనాలపై దర్శనమిస్తారు.
- జనవరి 25న రథ సప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణస్వామి ఉదయం 6 గంటలకు అశ్వ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
• జనవరి 24న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ సుందరాజస్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.

No comments :
Write comments