రాష్ట్ర
ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, టిటిడి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా 14 పాలిటెక్నిక్ కళాశాల నుండి 241 మందికి పైగా విద్యార్థినిలు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్ తదితర క్రీడల పోటీలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ దివాకర్ రెడ్డి, విజిఓ శ్రీ రామ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డా. పద్మావతమ్మ, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments :
Write comments