12.12.25

టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ srisailam temple chairman




టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ పి.రమేష్ నాయుడుబోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.


 సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారుశ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు.


 విషయంపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కు తెలియజేశారు.


అనంతరం టీటీడీ చైర్మన్ కు శ్రీశైలం దేవస్థానం బోర్డు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

No comments :
Write comments