23.12.25

తిరుప్పావై పాశురాల పారాయ‌ణం ప్రాశ‌స్త్యం tiruppavai




తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16 తేదీన మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది  నేపథ్యంలో డిసెంబరు 17 తేదీ ఉద‌యం నుండి స్వామివారికి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయ‌ణాన్ని నివేదిస్తున్నారుజనవరి 14 తేది వ‌ర‌కు తిరుప్పావై సేవ కొన‌సాగ‌నుంది.


ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం


ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారుబిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చ‌న చేస్తారుశ్రీ‌విల్లి పుత్తూరు చిలుకలను ప్ర‌తి రోజూ స్వామివారికి అలంక‌రిస్తారుధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష ప్ర‌సాదాల‌ను నివేదిస్తారుపురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారుకావున  మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.


ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం ప్రాశ‌స్త్యం


12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవిఒకరుఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారుశ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారుళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగంతమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉందిశ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.


ఏకాంతంగా తోమాల‌అర్చ‌న‌అర్జిత సేవ‌లు


ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను కూడా ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు కార‌ణంగా జ‌న‌వ‌రి 14 తేది వ‌ర‌కు తోమాల‌అర్చ‌న సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌రు సేవ‌ల‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.


వైకుంఠ ద్వార ద‌ర్శ‌న రోజుల్లో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు


డిసెంబ‌ర్ 29 నుండి జ‌న‌వ‌రి 1 తేది వ‌ర‌కు క‌ళ్యాణోత్స‌వంఊంజ‌ల్ సేవ‌ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వంస‌హ‌స్ర దీపాలంకార సేవ‌ల‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగిందిఅదేవిధంగా జ‌న‌వ‌రి 2 తేది నుండి  8 తేది వ‌ర‌కు శ్రీ‌వారి క‌ళ్యాణోత్స‌వంఊంజ‌ల్ సేవ‌అర్జి బ్ర‌హ్మోత్స‌వంస‌హ‌స్ర దీపాలంకార సేవ‌ల‌ను కూడా ఏకాంతంగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుందిభక్తులు అనుమతించబడరు.


 మార్పులను భక్తులు గమనించిటీటీడీ కి సహకరించ వలసిందిగా కోరడమైనది.

No comments :
Write comments