12.12.25

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌ ttd dairies





టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లుడైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి  విశేష స్పంద‌న వ‌స్తోంది.


శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు - 13 లక్షలు, 6 పేజీల క్యాలెండర్లు - 75 వేలుపెద్ద డైరీలు - 8.50 లక్షలుచిన్నడైరీలు - 3 లక్షలుటేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.50 లక్షలుశ్రీవారి పెద్ద క్యాలెండర్లు - 2.50 లక్షలుశ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు - 10 వేలుశ్రీవారుశ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు - 3 లక్షలుటీటీడీ స్థానిక ఆల‌యా క్యాలెండర్లు - 10 వేలు అత్యంత ఆకర్షణీయంగా ముద్రించి అందుబాటులో ఉంచింది.


ధరలు ఇలా ఉన్నాయి

 

– 12 పేజీల క్యాలెండర్ రూ.130/-,

 

–  డీలక్స్ డైరీ రూ.150/-,

 

– చిన్న డైరీ రూ.120/-,

 

– టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.75/-,


-  6 పేజీల 3డి డిజిట‌ల్‌ క్యాలెండర్ రూ.450/-,

 

– శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20 /-,

 

– శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.20 /-,

 

– శ్రీవారుశ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15 /-,

 

– తెలుగు పంచాంగం క్యాలెండర్ – రూ.30/-.


-  టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండర్లు - రూ.130/-.


తిరుమ‌లతిరుప‌తిలో....


తిరుమలతిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరంశ్రీనివాసంవిష్ణునివాసం ప్రాంతాల్లోనూతిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.


బ‌య‌టి ప్రాంతాల్లో


చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామిశ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలుహైదరాబాద్బెంగళూరువిజయవాడవైజాగ్‌లోని శ్రీ‌వారి ల‌యాలుముంబ‌యిన్యూఢిల్లీవేలూరుకాంచీపురంలోని సమాచార కేంద్రాలునెల్లూరురాజమండ్రికాకినాడకర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లుడైరీలు విక్రయిస్తున్నారు.


అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయందేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు  టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల‌ కోసం డైరీలుక్యాలెండర్లు సిద్ధంగా ఉంచారు.‌


ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు


అదేవిధంగా డైరీలుక్యాలెండర్లు టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది.  ఇందులో 12 పేజీల క్యాలెండర్డీలక్స్ డైరీ,  చిన్న డైరీటేబుల్‌ టాప్‌ క్యాలెండర్, 6 పేజీల 3డి  క్యాలెండర్ లను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.orgttdevasthanams.ap.gov.inఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు తపాలా శాఖ ద్వారా పంప‌బ‌డుతుంది.


డిడి తీసి పంపొచ్చు

 

భక్తులు డిడి తీసి పంపినా టిటిడి క్యాలెండర్‌డైరీలను  పొందవచ్చుఇందుకోసం " కార్యనిర్వహణాధికారిటిటిడితిరుపతి " పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి  డెప్యూటీ ఈవోపుస్తక ప్రచురణల విక్రయ విభాగంప్రెస్‌ కాంపౌండ్‌కెటి.రోడ్‌తిరుపతి " అనే చిరునామాకు పంపాల్సి ఉంటుందితపాలా శాఖ ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌డైరీలను పంపడం జరుగుతుందిరవాణా ఛార్జీలను అదనంగా తపాలా శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

 

క్యాలెండర్‌డైరీలకు సంబంధించి ఇతర సమాచారం కోసం 0877-2264209 నంబర్లలో సంప్రదించవచ్చు.


No comments :
Write comments