23.12.25

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్యుల‌కే పెద్ద‌పీట‌ vaikunta dwara darshanam








వైకుంఠ ద్వా ద‌ర్శ‌న ఏర్పాట్ల‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌మీక్షలో దేవాదాయ‌శాఖ మంత్రి శ్రీ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి


రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8 తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామ‌న్యుల‌కే పెద్ద‌పీఠ వేస్తున్న‌ట్లు రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి శ్రీ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలియ‌జేశారుతిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో సోమ‌వారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘంలోని రాష్ట్ర హోంశాఖ‌ మంత్రి శ్రీమ‌తి అనిత‌రెవెన్యూశాఖ మంత్రి శ్రీ అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ల‌తో క‌లిసి ఆయ‌న టీటీడీజిల్లాపోలీసు ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.


స‌మావేశంలోని ముఖ్యాంశాలు


•  ప‌దిరోజుల్లో 182 గంట‌ల ద‌ర్శ‌న స‌మ‌యంలో 164 గంట‌లు అంటే దాదాపు 90శాతం సామాన్యుల‌కే కేటాయింపు.

•  ప‌ది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు పటిష్ట ఏర్పాట్లు.

•  తొలి మూడు రోజుల ద‌ర్వ‌నాల‌కు 27 రాష్ట్రాల నుండి 23.64 ల‌క్ష‌ల మంది -డిప్ కు న‌మోదు

•  1.89 ల‌క్ష‌ల మంది సామాన్య భ‌క్తుల‌కు -డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు.

•  భ‌క్తులు ఏరోజు స‌మ‌యానికి ద‌ర్శ‌నానికి రావాలో స‌మాచారం అంద‌జేత‌.

•  టోకెన్ లేని భ‌క్తులు జ‌న‌వ‌రి 2 నుండి 8 తేది వ‌ర‌కు స‌ర్ ద‌ర్శ‌న క్యూలైన్ ద్వారా వైకుం ద్వార ద‌ర్శ‌నాలకు అవ‌కాశం.

•  స్వామివారి ద‌ర్శ‌నాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు విరివివిగా న్న‌ప్ర‌సాదాలుతాగునీరుత‌దిత‌ర స‌దుపాయాలు.

•  ఏఐ టెక్నాల‌జీతో క్యూలైన్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌భ‌క్తుల సంఖ్య‌వేచి ఉండే స‌మ‌యాన్ని అంచ‌నా వేస్తూ క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌.

-పోలీసులుటీటీడీ విజిలెన్స్ స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు.

•  అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని సంయ‌మ‌నంతో స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి.

•  భ‌క్తుల‌కు పూర్తిస్థాయిలో సంతృప్తి క‌లిగేలా నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లు అందించాల‌ని సిబ్బందికి సూచ‌న‌


 స‌మావేశంలో టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడుఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌దేవాదాయ‌శా సెక్ర‌ట‌రీ శ్రీ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రిజిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్‌ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడుసీవీఎస్వో శ్రీ ముర‌ళీ కృష్ణ‌ఇత‌ అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments