15.1.26

జనవరి 16న ఎస్వీ గోశాలలో ‘గోపూజ మహోత్సవం’ go puja




తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16 తేదీ కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.


 సందర్భంగా ఉదయం 5 గం. నుండి 10.30 గం. వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకంపూజహారతి కార్యక్రమం జరుగనుందిఉదయం 10.30 గం. నుండి 11.15 గం. రకు గోపూజకటమఅశ్వవృషభగజ పూజ జరుగనుందితదుపరి 11.15 గం.లకు  దాస సాహిత్య ప్రాజెక్టు ళాకారులతో భజనకోలాటాలుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారుమధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనంప్రసాదం పంపిణీ చేస్తారు.


గోపూజ మహోత్సవం రోజున గోవులకు బెల్లంబియ్యంగ్రాసం భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాతస్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

No comments :
Write comments