11.1.26

జ‌న‌వరి 17 నుండి 19 వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు purandara dasa




కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జ‌న‌వరి 17 నుంచి 19 తేదీ వరకు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జరుగనున్నాయి.


మొదటిరోజైన జ‌న‌వరి 17 ఉదయం సుప్రభాతంధ్యానంసామూహిక భజననగరసంకీర్తన కార్యక్రమాలుపురంద‌ర సాహిత్య‌ గోష్ఠివివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలుసంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారుఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌ము పీఠాధిప‌తులు మంగ‌ళా శాస‌న‌ములు అందిస్తారు.


రెండవ రోజైన జ‌న‌వరి 18 ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారుసాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపుఊంజల్‌సేవదాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.


చివరిరోజు జ‌న‌వరి 19 ఉదయం సుప్ర‌భాతంధ్యానంసామూహిక భ‌జ‌న‌న‌గ‌ర సంకీర్త‌నఉపన్యాసములుసంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


జనవరి 12 శ్రీ వేంకటేశ నవరత్నమాల సంకీర్తనా కార్యక్రమం


శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలలో భాగంగా జనవరి 12 తేది సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని పాపవినాశనం రోడ్డు లో గల కళ్యాణమస్తు వేదికపై శ్రీ వేంకటేశ నవరత్న సంకీర్తనా కార్యక్రమం నిర్వహించనున్నారు కార్యక్రమంలో శ్రీ పురందరదాసుల వారు శ్రీవేంకటేశ్వర స్వామివారిని స్తుతిస్తూ చేసిన సంకీర్తనలలోని నవరత్నాలలాంటి 9 సంకీర్తనలను 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్ఠిగానం చేయనున్నారు.


No comments :
Write comments