30.1.26

ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు jubilee hills temple




తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25 తేదీ వరకు జరగనున్నాయిఫిబ్రవరి 16 తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.


ఫిబ్రవరి 10 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


 సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపిఅనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.  ఉదయం 07.00 గం. నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారుఅనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 11 గం. నుండి సాయంత్రం 05.00 గం. వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.


ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ

17-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం -  . 10.30 - 11.00 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


18-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


19-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


20-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


21-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం. నుండి 09.00 గం. వరకు)


22-02-2026


ఉదయం – హనుమంత వాహనం


రాత్రి – గజ వాహనం


23-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


24-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


25-02-2026


ఉదయం – చక్రస్నానం(. 08.00 నుండి 10.00 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)


26.02.2026.


మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

No comments :
Write comments