8.1.26

భక్తి శ్రధ్ధలతో శ్రీ త్యాగరాజ స్వామి వారి 179వ ఆరాధన ఉత్సవం tyagaraja aaradhana









టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీక నృత్య కళాశాలఎస్వీ నాదస్వరడోలు పాఠశాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 179 ఆరాధన ఉత్సవం జరుగుతోందిశ్రీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆవరణంలోని ఓపెన్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 7.30 గం. నుండి జనవరి 08 తేదీ ఉదయం 8 గం. వరకు 24 గంటల పాటు అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం జరుగనుంది.


 సందర్భంగా ఉదయం 7.30 గం.లకు నాదస్వర డోలు కచేరీ అనంతరం  శ్రీ త్యాగరాజస్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమంఘనరాగ పంచరత్న  కీర్తనల బృందగానం నగరంలోని సంగీత విద్వాంసులు కళాశాల అధ్యాపక బృందం సంయుక్తంగా నిర్వహించారుఅనంతరం సంగీత విద్వాంసులుసంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థులుప్రస్తుత విద్యార్థులుకళాశాల మరియు నాదస్వర డోలు పాఠశాలలోని అధ్యాపక ఉపాధ్యాయ బృందం వారికి కేటాయించిన సమయానికి గాత్ర , వాద్య సంగీత కచేరీలు ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయిఉదయం 8.50 గం. నుండి 10.30 గం. వరకు శ్రీ త్యాగరాజ విరచిత ఘనరాగ పంచరత్న కృతులు బృందగానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


24 గంటల అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం గురువారం ఉదయం 7:30 గంటలకు వరకు నిర్వహించిఅనంతరం  శ్రీ ఆంజనేయ ఉత్సవం మరియు మహా మంగళహారతి కార్యక్రమంతో పరిసమాప్తి అవుతుందని ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.  ఉమా ముద్దుబాల తెలిపారు.

No comments :
Write comments