టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 18 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 28న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 03న ప్రణయకలహ మహోత్సవం, ఫిబ్రవరి 07న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10న తన్నీర్ అముధు ఉత్సవంతో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి.
No comments :
Write comments