10.1.26

జనవరి 19 నుండి 27 తేదీ వరకు కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు prasanna venkateswara swamy varu




అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 19 నుండి 27 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయిజనవరి 18 తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


కాగాజనవరి 24 తేదీ రాత్రి 08.00 గం. నుండి 10.00 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుందిరూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరుకల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుజనవరి 28 ఉదయం 10.గం.లకు స్నపన తిరుమంజనంసాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 08.00 గం. నుండి 09.00 గం. వరకు రాత్రి 08.00 గం. నుండి 10.00 గం. వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.  


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలుభ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


19.01.2026  ఉదయం – ధ్వజారోహణం (కుంభ లగ్నం)      రాత్రి – పల్లకి ఉత్సవం


20.01.2026  ఉద‌యం – శేష వాహనం                             రాత్రి – హంస వాహనం


21.01.2026  ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం          రాత్రి – సింహ వాహనం


22.01.2026  ఉద‌యం – కల్పవృక్ష వాహనం                   రాత్రి – హనుమంత వాహనం


23.01.2026  ఉద‌యం – సూర్యప్రభ  వాహనం                  రాత్రి – చంద్రప్రభ వాహనం


24.01.2026  ఉద‌యం – సర్వభూపాల వాహనం               రాత్రి – కల్యాణోత్సవంగరుడ వాహనం (రాత్రి 10.30 గం.లకు)


25.01.2026  ఉద‌యం – రథోత్సవం                                 రాత్రి – గజ వాహనం


26.01.2026  ఉద‌యం – పల్లకి ఉత్సవం                           రాత్రి – అశ్వ వాహనం


27.01.2026  ఉద‌యం – వసంతోత్సవంచక్రస్నానం           రాత్రి – ధ్వజావరోహణం


No comments :
Write comments