బెంగుళూరుకు చెందిన ఎస్పీ మైక్రో సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,07,777 విరాళంగా అందించారు.
అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం శివకాశికి చెందిన స్టాండర్డ్ మ్యాచ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
No comments :
Write comments