తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వర్ధంతి జనవరి 21న, శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి జనవరి 23న టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.
జనవరి 21న ఉదయం 9 ఎస్వీ ఓరియంటర్ కాలేజీ పరిసరాలలో ఉన్న శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వర్ధంతి సభ ఘనంగా జరుగనుంది.
జనవరి 23న ఉదయం 9 శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రాంగణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి సభ ఘనంగా జరుగనుంది.
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.
No comments :
Write comments