21.1.26

జనవరి 26 నుండి ఫిబ్రవరి 01వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు teppostsavams




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 26 నుండి ఫిబ్రవరి 01 తేదీ వరకు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి.


ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజస్వామివారి పుష్క‌రిణిలో తెప్పల‌పై విహరిస్తారు త‌రువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.


జనవరి 26 శ్రీ కోదండరామస్వామివారుజనవరి 27 శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థసారథిస్వామి వారుజనవరి 28 శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారుజనవరి 29 ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారుజనవరి 30, 31, ఫిబ్రవరి 01 తేదీల్లో అమ్మవార్లతో శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పల‌పై భక్తులకు కనువిందు చేయ‌నున్నారుచివ‌రి రోజు తెప్పోత్స‌వం అనంత‌రం ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు.

No comments :
Write comments