శ్రీ
గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు.
ఇందులోభాగంగా సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామి వారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments