26.1.26

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం తిరుమలలో వైభవంగా రథసప్తమి








సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.


ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు  ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారుఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభచిన్నశేషగరుడహనుమల్పవృక్షసర్వభూపాలచంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం.  కారణంగా  ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవంమినీ బ్రహ్మోత్సవంఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.


రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ. 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయిసూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.


సూర్యప్రభ వాహనం – (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) :


సూర్యుడు సకలరోగ నివారకుడుఆరోగ్యకారకుడుప్రకృతికి చైతన్య ప్రదాతఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడేఅందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాంఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలుసత్సంతాన సంపదలుఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.


ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్య హృదయం’, ‘సూర్యాష్టకం


రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెంది విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయంసూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారుగతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలుఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యంవివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.


 కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడుఈవో శ్రీ నిల్ కుమార్ సింఘాల్బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూశ్రీ మ్మెస్ రాజుశ్రీమతి పనబాక లక్ష్మిశ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిశ్రీ భాను ప్రకాష్ రెడ్డిశ్రీ ఎన్సదాశివరావుశ్రీ నరేష్ , శ్రీ శాంతా రామ్శ్రీమతి జానకి దేవిశ్రీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.


కాగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి జేఈఓ శ్రీ వీరబ్రహ్మంసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడులతో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యావేక్షించారు.


No comments :
Write comments