21.1.26

స్థానిక, అనుబంధ ఆలయాలలో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు corpus fund





టిటిడి స్థానికఅనుబంధ ఆలయాల నిర్వహణబడ్జెట్ఎస్వోపీఅభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూటిటిడి అనుబంధస్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయంఖర్చులు ఎంత వస్తోంది  ఆలయాలకు బడ్జెట్ కు లోబడి ఖర్చులు అవుతున్నాయి, ఏఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అవుతున్నాయనే అంశాలపై అధికారులతో చర్చించారుఇకపై ప్రతి లయ నిర్వహణ కోసం ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని సూచించారుఆలయాల రోజువారి నిర్వహణమరమ్మతులు తదితర సాధారణ ఖర్చులను కార్పస్ ఫండ్ కు వచ్చే వడ్డీ సొమ్ముతో  ఖర్చు చేయాలని సూచించారుపెద్ద స్థాయిలో మరమ్మతులువార్షిక ఉత్సవాల కోసం కేపిటల్ ర్చుగా భావించి టిటిడి నిధులతో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  


అదేవిధంగాప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లుసిసిటివీలుసెక్యూరిటీరవాణాట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారువచ్చే వేసవి నేపథ్యంలో టిటిడి ఆలయాలలో  భక్తులకు వైద్యసేవలుతాగునీరు,  వ్యర్థాల నిర్వాహణమరుగుదొడ్లు తదితర అంశాలపై  ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారుటిటిడిలోని ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకుకార్యక్రమాల నిర్వహణపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్ఓపీరూపొందించాలన్నారుభక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.


 కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంఎప్ఏఅండ్ సీఏవో శ్రీ బాలాజీసీఈ శ్రీ టి.విసత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments