20.1.26

ధ్వజారోహణంతో ప్రారంభంమైన దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు devuni kadapa





కడప జిల్లాదేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయిముందుగా శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు‌గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారుసకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 10.00 గం. నుండి 10.30 గం. మధ్య తిరుచ్చి ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారుఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడి ధ్వజపటానికి అర్చకులు ప్రత్యే పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారుకాగారాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు విహరించనున్నారు.


ఆలయ నేపథ్యం - దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనదికృష్ణాచార్యులు ఇచ్చట శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్టించినట్లు ప్రతీతితిరుమల వరాహ క్షేత్రమైతే దేవుని కడప హనుమత్ క్షేత్రంఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వెనుక భాగమున ఆంజనేయ స్వామి విగ్రహం ఉందిశ్రీ తాళ్ళపాక అన్నమాచార్యు వారు ప్రత్యక్షంగా సేవించిస్వామివారిని కడప రాయుడనివేంకటాద్రి కడప రాయుడని పేర్కొన్నారుపూర్వం తిరుపతికి వెళ్లే యాత్రికులకు మార్గమిదేదేవుని కడపలో వెలసియున్న శ్రీ స్వామివారి దర్శనాంతరమే తిరుమలేశుని దర్శించడం సాంప్రదాయంగా వస్తోంది ఆలయంలో రాజగోపురంతిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ గోపురం ఒకే కాలంలో నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోందిస్వామివారి థోత్సవంరథసప్తమి రోజున కన్నుల పండవగా నిర్వహిస్తారురథసప్తమిరోజున భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


19.01.2026  ఉదయం – ధ్వజారోహణం (మీన లగ్నం)      రాత్రి – చంద్రప్రభ వాహనం


20.01.2026  ఉద‌యం – సూర్యప్రభవాహనం                    రాత్రి – పెద్దశేష వాహనం


21.01.2026  ఉద‌యం – చిన్నశేష వాహనం                     రాత్రి – సింహ వాహనం


22.01.2026  ఉద‌యం – కల్పవృక్ష వాహనం                   రాత్రి – హనుమంత వాహనం


23.01.2026  ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం        రాత్రి – గరుడ వాహనం


24.01.2026  ఉద‌యం – కల్యాణోత్సవం                            రాత్రి – గజ వాహనం


25.01.2026       రథోత్సవం  ( మధ్యాహ్నం 02.00 గం.)     రాత్రి – ధూళి ఉత్సవం


26.01.2026  ఉద‌యం – సర్వభూపాల వాహనం              రాత్రి – అశ్వ వాహనం


27.01.2026  ఉద‌యం – వసంతోత్సవంచక్రస్నానం   రాత్రి – హంసవాహనంధ్వజావరోహణం


కాగాజనవరి 24 తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుందిరూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరుకల్యాణోత్సవంలో పాల్గొనవచ్చుజనవరి 28 సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 09.00 గం. నుండి 10.00 గం. వరకు రాత్రి 08.00 గం. నుండి 09.00 గం. వరకు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.  


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనసేవల ముందు కోలాటాలుహరికథభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్ ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్ సంకీర్తనలను ఆలపించనున్నారు.


 కార్య‌క్ర‌మంలో ఆలయ అర్చకులు,   పలువురు అధికారులు  పాల్గొన్నారు.

No comments :
Write comments