తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన శ్రీ కె. దీపక్ గురువారం ఉదయం 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు.
దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను టిటిడి అధికారులకు దాత అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments :
Write comments