16.1.26

తిరుపతిలో వైభవంగా గోదా కల్యాణం goda parinayam









తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో  మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగిందికళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.


ముందుగా శ్రీకృష్ణస్వామిశ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు


అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారుఅనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజపుణ్యాహవాచనంఅంకురార్పణంరక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారుసర్కారు సంకల్పంభక్తుల సంకల్పంమధుపర్క నివేదనంవస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారుతదుపరి మహా సంకల్పంస్వామిఅమ్మవార్ల ప్రవరలుమాంగల్యపూజమాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారుఅనంతరం ప్రధాన హోమములాజ హోమముపూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారువారణమాయిరంమాలా పరివర్తనంఅక్షతారోపణం జరిపి చివరగా నివేదనమంగళ హారతులు నిర్వహించారుగోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.


తర్వాత ఎస్వీ సంగీత నృత్య కళాశా విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది.


టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవో శ్రీ వివీరబ్రహ్మంజిల్లా ఎస్పీ శ్రీ ఎల్సుబ్బరాయుడుసివిఎస్ఓ శ్రీ కే.విమురళీకృష్ణఇతర అధికారులుశ్రీవారి ఆలయ అర్చకులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


 శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్  కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.

No comments :
Write comments