19.1.26

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం narayanagiri







తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయిశ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయిముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.


టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ధ్వర్యంలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు.


టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులుశ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంఇతర అధికారులు, 3,500 మందికి పైగా ఆంధ్రతెలంగాణకర్ణాటక రాష్ట్రాలకు చెంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.


No comments :
Write comments