జనవరి
25వ తేదిన రథ సప్తమి సందర్భంగా వాహన సేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి గురువారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాలు గ్యాలరీల్లోని ప్రతి భక్తుడికి చేరేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ తనిఖీల్లో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments