28.1.26

స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం radha saptami






రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలుతిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలువైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే  ఏడాది జనవరి 25 తేదిన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీజిల్లాపోలీసు యంత్రాంగంఏపీఎస్ ఆర్టీసీశ్రీవారి సేవకుల స‌మిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలియ‌జేశారుర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతమ‌వ్వ‌డంతో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని  గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారుగత అనుభవాలను దృష్టిలో ఉంచుకునిభక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలుసలహాలుసూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారురథ సప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములువాహన బేరర్లుశ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు.


అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా భక్తుల నుండి వాట్సాప్, ఐవీఆర్ఎస్శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించడం జరిగిందనిభక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారుఉత్తరమాడ వీధిలో ఒక భక్తుడు కూడా దుపాయాలు బాగాలేవని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమని పేర్కొన్నారుపలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లుస్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.


స‌మావేశంలోని ముఖ్యాంశాలు


•  గతంలో ఎన్నడూలేనివిధంగా  ఏడాది రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షణ‌.


•  అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణభక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం.


అన్నప్రసాదాలు


•  ర‌థ స‌ప్తమి రోజున గ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు విరివిగా అన్న ప్ర‌సాదాలుపానీయాలు పంపిణీ.


•  సొజ్జ‌ రవ్వ ఉప్మాగోధుమ రవ్వ ఉప్మాసాంబార్ రైస్టమోటా రైస్పులిహోరచక్కెర పొంగలివేడి బాదం పాలుకాఫీపాలుమజ్జిగసుండలుబిస్కెట్లను భక్తులకు పంపిణీ.


•  9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ.


•  వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలుపానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగం.


విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ


•  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని  1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలు వినియోగం


•   సందర్భంగా జిల్లా ఎస్పీగారికి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు.


లగేజీ కేంద్రాల నిర్వహణ


•  గతంలో ఎన్నడూలేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్స్బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్.


•  ఇది గత ఏడాది కంటే 73 శాతం ధికం.


పబ్లిక్ అడ్రెస్ సిస్టం


•  ప‌బ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భ‌క్తులకు అవ‌స‌ర‌మై స‌మాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ భాష‌ల్లో అంద‌జేత‌.


రవాణా


•  భక్తులను తిరుమలకు చేరవేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ అద్భుతమైన సేవలు.


•  తిరుపతి నుండి తిరుమలకు 1932 ట్రిప్పుల ద్వారా 60425 మంది క్తులు ప్రయాణించగాతిరుమల నుండి తిరుపతికి 1942 ట్రిప్పుల ద్వారా 82,241 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి చేరవేత‌.


విద్యుత్పుష్పాలంకరణ


•  రథ సప్తమి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్పుష్పాలంకరణలు అద్భుతంగా ఉన్నాయని భక్తు నుండి విశేషస్థాయిలో ప్రశంసలు.


సాంస్కృతిక కార్యక్రమాలు


•  శ్రీవారి వాహ‌న‌సేవ‌ల ఎదుట క్తులను ఆక‌ట్టుకునేలా 1000 క‌ళాకారులు  ప్ర‌ద‌ర్శ‌న‌లు.


పారిశుద్ధ్య సేవలు


•  భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మెరుగైన పారిశుద్ధ్య సేవలు.


•  గ్యాలరీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుద్ధ్యం లోపం తలెత్తకుండా చర్యలు.


•  ఇందుకుగాను అదనంగా 590 పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వినియోగం.


వైద్య సేవలు


•  అత్యవసర వైద్య సహాయం అవసరమైన భక్తులకు వైద్యులుపారామెడికల్ సిబ్బందిఅంబులెన్సుల ద్వారా వైద్య సేవలు.


•  రథ సప్తమి రోజున 23 వేల మంది భక్తులకు వైద్య సేవలు, 94 మందిని అంబులెన్సుల ద్వారా తిరుపతిలోని ఆస్పత్రులకు తరలింపు.


ఎస్వీబీసీ 


•  ఎస్వీబీసీ చానెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించేలా ప్రత్యక్ ప్రసారం.


•  రథ సప్తమి వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన టీటీడీజిల్లాపోలీసు

No comments :
Write comments