తిరుపతి
టిటిడి పరిపాలన భవనంలో జనవరి 26వ తేదీ సోమవారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరిపాలన భవనం వెనక వైపున గల పరేడ్ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ భద్రతా విభాగంలోని బెటాలియన్ల పరేడ్, విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడిలోని ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొంటారు.
No comments :
Write comments