తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు.
అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.
సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వి. ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, అర్చకులు, సూపరింటెండెంట్లు శ్రీ చిరంజీవి, శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, రాధాకృష్ణ , రంజిత్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






No comments :
Write comments