27.1.26

సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి క‌టాక్షం suryaprabha vahanam








తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉద‌యం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపితోమాల‌కొలువుపంచాంగ శ్ర‌వ‌ణం, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌హించారుఅనంత‌రం ఉదయం   సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించారు.


అదేవిధంగా రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ  అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్త‌లు పాల్గొన్నారు.


No comments :
Write comments