తిరుపతిలోని
శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారు కటాక్షించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షి, లక్ష్మీ, సరస్వతి అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో 9 చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు ఉన్నారు.A
No comments :
Write comments