శ్రీవారి
బ్రహ్
మోత్సవాలు
, వైకుంఠ
ద్వార
దర్శనా
లను
విజయవంతం
చేసినట్లే
రథ
సప్
తమిని
కూడా
విజయవంతం
చేసేందుకు
కలిసికట్టుగా
పని
చేయాలని
టీటీ
డీ
ఉద్యోగులకు
అదనపు
ఈవో
శ్రీ
సి
.హెచ్
.వెంకయ్య
చౌదరి
సూచించారు
. తిరుమలలోని
ఆస్థాన
మండపంలో
రథ
సప్తమి
డిప్యూటేషన్
విధులు
నిర్
వహించే
ఉద్యోగులు
, శ్రీవారి
సే
వకులతో
శనివారం
సాయంత్రం
ఆయన
సమా
వేశమయ్యారు
.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సమిష్టి కృషితో భక్తులకు సేవలందించాలని చెప్పారు. మాడ వీధుల్లోని సిసి కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తున్నామని, తద్వారా వాహన సేవలను ఎంతమంది తిలకించారనే ఖచ్చితమైన అంచనా వేయవచ్చని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు గ్యాలరీల్లోని భక్తులకు అందించే సేవలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఎఫ్ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ సిఎఫ్ శ్రీ ఫణి కుమార్ నాయుడు, సీపీఆర్వో డాక్టర్ రవి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
No comments :
Write comments