27.1.26

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యంగా సంస్కరణలు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo






టీటీడీలో వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తూభక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. 77 గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను తిరుమ‌ల‌లోని గోకులం అతిథి గృహంలో సోమ‌వారం ఉద‌యం ఘ‌నం నిర్వ‌హించారు


 సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో జాతీయ జెండాను ఎగుర‌వేసి జెండా వంద‌నం స‌మ‌ర్పించి టీటీడీ సిబ్బందితిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులువిజిలెన్స్ సిబ్బందిపోలీసు విభాగంశ్రీవారి సేవకులుభక్తులుమీడియా ప్ర‌తినిధుల‌కు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


అనంత‌రం ఆయ‌న టీటీడీ సిబ్బందిభ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.


రాజ్యాంగ స్ఫూర్తే వ్యవస్థల నిర్మాణానికి పునాది


గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిస్వయం పాలన సాధించిన రోజు అని  దేశమైనా సంస్థైనా దీర్ఘకాలికంగా నిలవాలంటే బలమైన వ్యవస్థస్పష్టమైన నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని న్నారు.


భారత రాజ్యాంగం కాలానుగుణంగా సవరణలు చేసుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగడం వల్లే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని తెలిపారు.


టీటీడీలో పాలసీ ఆధారిత పాలన


టీటీడీ కూడా ఒక పురాతనమహత్తర ధార్మిక సంస్థగా కాలానుగుణంగా  వ్యవస్థలను పునఃపరిశీలిస్తూభక్తుల అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు చేపడుతోందని చెప్పారుఒకటిన్నర సంవత్సరాల్లో టీటీడీలో న్న‌ప్ర‌సాద విభాగం పాల‌సీలో అనే విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చామ‌ని పేర్కొన్నారుకాటేజ్ డొనేషన్ స్కీమ్ లో సమగ్ర పాలసీ తీసుకురావ‌డానికి విశేష కృషి చేశామ‌ని తెలిపారుఇత‌ర పాల‌సీల‌ను కూడా ప‌టిష్టం చేసేందుకు ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలియ‌జేశారు.


కొనుగోళ్ల విభాగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు 


టీటీడీ కొనుగోళ్ల విభాగానికి సంబంధించి ఉత్పత్తులుప్రాసెస్‌లుఅగ్రిమెంట్లుక్యాన్సిలేషన్బ్లాక్‌లిస్టింగ్ వంటి అంశాలతో కూడిన స‌మ‌గ్ర పాల‌సీ సిద్ధమవుతోందనిఅలాగే అన్ని ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలను పోర్టల్ ద్వారా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారుదీంతో పార‌ద‌ర్శ‌క‌త‌ పెరిగి మాన‌వ జోక్యం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.


అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో ఉత్స‌వాలు విజ‌య‌వంతం


బ్రహ్మోత్సవాలువైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటి వరుసగా జరిగిన త్స‌వాల‌ను లక్షలాది భక్తుల మధ్ అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో మర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారుప్రతి కార్యక్రమం అనంతరం పునఃస‌మీక్షించ‌డం ద్వారా విష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.


భ‌క్తుల నుండి అభిప్రాయ సేక‌ర‌ణ‌


వాట్సాప్ఐవీఆర్ఎస్ఫోన్ కాల్స్శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్ప‌టిక‌ప్పుడు అభిప్రాయాలను సేకరిస్తూ సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరుస్తున్నామని తెలిపారుఅన్నప్రసాద సేవల్లో 96–97% మంది భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేయ‌గాలడ్డూ నాణ్య‌త‌పై పూర్తిస్థాయిలో భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలియ‌జేశారు.


సాంకేతిక సంస్కరణలు


వైకుంఠం–1లో ఏర్పాటు చేసిన ఏఐ ధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో సమయాన్ని సమర్థంగా వినియోగించుకుని చరిత్రలోనే ఎన్న‌డూ లేని విధంగా అత్యధికంగా 7.83 లక్షల మందికి దర్శనం క‌ల్పించామ‌ని చెప్పారుతిరుమ‌ల‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిస్‌ప్లే సిస్టమ్ ద్వారా బ‌స్ స్టాప్  వ‌ద్ద వేచి ఉండే భ‌క్తుల‌కు బ‌స్సులు వ‌చ్చే స‌మ‌యాన్ని ముందుగానే తెలియ‌జేసేలా ఏర్పాట్లు చేయ‌డంతో భ‌క్తుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌ని తెలిపారు


క్యూఆర్ కోడ్ ఆధారిత పాద ర‌క్ష‌ కేంద్రాలు


తిరుమ‌ల‌లో భ‌క్తుల పాద ర‌క్ష‌లు భ‌ద్ర ప‌ర‌చుకునే స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా ల‌గేజీ కౌంట‌ర్ల త‌ర‌హాలో క్యూఆర్ కోడ్ ఆధారిత పా ర‌క్ష‌ల కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డంతో అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు.  ప్ర‌తి వ్యవస్థలో పవిత్రతపారదర్శకతభక్తు ప్రయోజనాలే కేంద్రంగా టీటీడీ ముందుకు సాగుతుందనితిరుమల ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


 కార్యక్ర‌మంలో టీటీడీ సిఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర‌శ్రీ భాస్కర్శ్రీ వెంకటయ్యశ్రీ సోమ‌న్నారాయ‌ణ‌డిఈ శ్రీ చంద్ర‌శేఖ‌ర్వీజీఓ శ్రీ సురేంద్ర‌ఇత‌ అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments