18.1.26

టిటిడి కల్యాణ మండపాలు మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ : ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ttd eo




టిటిడి కళ్యాణ మండపాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారుటిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు


 సందర్భంగా ఈవో మాట్లాడుతూభక్తుల నుండి అభిప్రాయం సేకరించేందుకు హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారుఅదే విధంగాటిటిడి కళ్యాణ మండపాలకు సంబంధించి భక్తుల నుండి స్థానిక శ్రీవారి సేవకుల ద్వారా ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా నిర్వహణ  సౌకర్యాలు అవసరమో తెలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారుకళ్యాణ మండపాల నిర్వహణను ఎఫ్ ఎం ఎస్ పరిధిలోకి తీసుకువస్తే పరిశుభ్రతమెరుగైన సౌకర్యాల నిర్వహణ మరింత సులభతరం అవుతుందన్నారు


దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి కళ్యాణ మండపాలలో కాంపౌండ్ వాల్స్మరుగుదొడ్లుకళ్యాణ వేదికఅలంకరణవివాహ వేడుకలను నిర్వహించేందుకు అనువుగా ఉన్నాయాపార్కింగ్ సౌకర్యంవర్షాకాలంలో లీకేజీలు ఉన్నాయాకల్యాణ మండపాలలో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయాసెక్యూరిటీ తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించడం ద్వారా మరింత మెరుగైన సౌకర్యాల ఏర్పాటు చేయవచ్చని అధికారులకు సూచించారు


 కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజనీర్ శ్రీ టి.వి.సత్యనారాయణఎఫ్  అండ్ సీఏవో శ్రీ  బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు


No comments :
Write comments