10.1.26

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి vaikunta dwaradarshan






డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8 తేది వ‌ర‌కు నిర్వ‌హించిన వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేసిన ఏర్పాట్ల‌పై భ‌క్తులు విశేష సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు తెలియ‌జేశారువైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు విజ‌య‌వంతం కావ‌డంతో ఆయ‌ టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రిల‌తో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.


స‌మావేశంలోని ముఖ్యాంశాలుః


•  స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ ల్పించిన సౌకర్యాలు అద్భుతంగా న్నాయని ఆనందం వ్యక్తం చేశారు.


•  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం.


•  వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి.


శ్రీవారి ఆలయం


•   పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు.


•  గ‌త వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో 6.83 ల‌క్ష‌ల మంది ద‌ర్శించుకోగా  ఏడాది ల‌క్ష మంది భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌నాలు.


•  జనవరి 2 తేది శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డుస్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం.


•  జనవరి 3 తేది శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి ర్శనం.


•  అందుబాటులో ఉన్న 182 గంటల దర్శ సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం.


•   పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు.


•  భక్తులకు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 44 లక్షలు


•  గత ఏడాదితో పోల్చితే  ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయం.


భద్రత : 


•  దాదాపు 2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.


•  వివిధ విభాగాల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తు రద్దీని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు.


ఇంజినీరింగ్ : 


•  తిరుమలతిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలా 400 ప్రచార బోర్డులు ఏర్పాటు


•  రేడియో బ్రాడ్ కాస్టింగ్ ద్వారా 5 భాషల్లో వైకుంఠ ద్వార దర్శనాలపై అవగాహన.


•  తిరుమలలో విద్యుత్ దీపాలంకరణపై భక్తులు విశేష ప్రశంస.


•  తిరుమలలో టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో భక్తులకు బ్బంది కలగకుండా బ్యారికేడ్లు ర్పాటు


•  తిరుమలలో నీటి కొరత లేకుండా నిరంతరాయం భక్తులకు నీటి సరఫరా.


అన్న ప్రసాదం :


•   ప‌ది రోజుల్లో 33 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాల పంపిణీ.


•  గ‌త వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌తో పోల్చితే ఈసారి 9.29 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు అద‌నంగా అన్న ప్ర‌సాదాలు పంపిణీ.


•  తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లలో  నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ.


•  గత ఏడాదితో పోల్చితే  ఏడాది దాదాపు 39 శాతం అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ.


•  తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి బాదం పాలు సరఫరా.


•  దాదాపు 1000 మంది అన్న ప్రసాదం సిబ్బందితో విజయవంతంగా ఎప్పటికప్పుడు అన్న ప్ర‌సాదాలు త‌యారు చేసి పంపిణీ చేయడంతో భక్తులల్లో సంతృప్తి.


రిసెప్షన్


•  PAC-1, 2, 3, 4, 5 లో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి.


•  నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన PAC-5 భవనం అందుబాటులోకి రావడంతో భక్తులకు విరివిగా వసతి సదుపాయం.


•  సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉంచడంతో సౌకర్యవంతంగా గదులు పొంది భక్తులు.


•  తొలి మూడు రోజులు టోకెన్ కలిగిన భక్తులకే దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు పొందిన భక్తులు 


ఉద్యానవనం : 


•  ఉద్యనవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరంగనాధ స్వామి ఆలయ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


•  శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో ఏర్పాటు చేసిన అలంకరణలు వైకుంఠాన్ని తలపించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.


కల్యాణకట్ట:


•   పది రోజుల్లో 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పణ.


•  తలనీలాల సమర్పణకు భక్తులకు లాంటి ఇబ్బంది తలెత్తకుండా సౌకర్యవంతం ఏర్పాట్లు.


•  గతంలో కంటే ప్రస్తుతం తలనీలా సమర్పణ సులువుగా సౌకర్యవంతంగా ఉందని చాలా మంది భక్తులు తెలియజేశారు.


•  ఆరోగ్య విభాగం


•  దర్శన క్యూ లైన్లురోడ్లుమరుగుదొడ్ల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట.


•  దర్శన క్యూలైన్లురద్దీ ప్రాంతాల్లో భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్స్ తో తాగు నీరు పంపిణీ.


వైద్య విభాగం


•  24 గంటలు దర్శన క్యూ లైన్లునారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీల ద్వారా అవసరమైన భక్తులకు వైద్యం.


శ్రీవారి సేవకులు


•  వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా దాదాపు 4వేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు.


•  ముఖ్యంగా అన్న ప్రసాద విభాగంలో 1900 మందిఆరోగ్య విభాగంలో 625 మందివిజిలెన్స్ విభాగంలో 400 మంది సేవకుల సేవలు.


•  150 మంది గ్రూప్ సూపర్వైజర్లు 2గంటలు భక్తులు రద్దీని పర్యవేక్షిస్తూ అద్భుతమైన సేవలు అందించారు.


 సందర్భంగా టీటీడీ యంత్రాంగం తో సమన్వయం చేసుకుని చక్కటి సేవలు అందించిన పోలీస్ యంత్రాంగంజిల్లా యంత్రాంగంఏపీఎస్ ఆర్టీసీశ్రీవారి సేవకులుఇతర విభాగాలుమీడియా ప్రతినిధులకు చైర్మన్ ధన్యవాదాలు తెలియజేశారు.


టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని చెప్పారుగత వైకుంఠ ఏకాదశి రోజు 7 లక్షలకు పైగా దర్శించుకుంటే ఈసారి 12 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని తెలిపారుటీటీడీ భక్తుల కోసం చేస్తున్న సౌకర్యాలను చూసి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని చెప్పారు.

No comments :
Write comments