4.1.26

స్థానిక అనుబంధ ఆలయాలకు ప్రత్యేక అధికారుల ఏర్పాటు - టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ VIRTUAL REALITY SUPPORT





టిటిడి స్థానికఅనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారుటిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఉన్నతాధికారులతో శనివారం టిటిడి ఈవో సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూటిటిడి స్థానికఅనుబంధ ఆలయాల ప్రాశస్త్యంశిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకునిఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారుఆలయాల శిల్పాలుచిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్  చేసినట్లు అయితే సంబంధిత పౌరాణికచారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారుఅదేవిధంగాతిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్ లో అందిస్తున్న తరహాలో టిటిడి స్థానిక ఆలయాలుఅనుబంద ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.


టిటిడి అనుబంధస్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారుప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారుగౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారుఅందులోభాగంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి  అవసరమైన చర్యలు చేపట్టాలన్నారుఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారుభక్తుల సౌకర్యార్థం క్యూలైన్లుసిసిటివీలుసెక్యూరిటీరవాణాట్రాఫిక్ తదితర అంశాలపై టిటిడి సివిఎస్వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారుఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలువాహన సేవలకు సంబంధించిప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలుభక్తులకు వైద్యసేవలుశ్రీవారి సేవకుల సేవలుపుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు,  బడ్జెట్వ్యర్థాల నిర్వాహణమరుగుదొడ్లు తదితర అంశాలపై  ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.


 సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వివీరబ్రహ్మంసివిఎస్వో శ్రీ కె.విమురళీకృష్ణఎఫ్ఏఅండ్ సిిఏవో శ్రీ  బాలాజీసీఈ శ్రీ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments