7.2.26

ఫిబ్ర‌వ‌రి 07న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ kalayana venkateswara swamy vari temple




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఫిబ్ర‌వ‌రి 07 తేదీన‌ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుందిఆలయంలో ఫిబ్రవరి 08 నుండి 16 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


 సందర్భంగా 07 తేదీ శనివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహవాచనంమృత్సంగ్ర‌హ‌ణంసేనాధిప‌తి ఉత్స‌వంఅంకురార్ప‌ణ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 8 ధ్వ‌జారోహ‌ణం


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు ఫిబ్ర‌వ‌రి 8 ఉద‌యం 8.15 నుండి 8.35 గంట‌ల మ‌ధ్య కుంభ ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుందిఅంత‌కుముందు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగ‌నుంది.


బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయిఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.  శ్రీనివా మంగాపురం పరిసర గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టారువాహనసేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలుమజ్జిగపాలుతాగునీరువైద్యపార్కింగ్క్యూలైన్లుభద్రత తదితర  సేవలను అందించనున్నారు.


ఆకట్టుకునేలా అలంకరణలు :


బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయంపరిసర ప్రాంతాల్లో క్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారుబ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 1టన్నుల పుష్పాలను వినియోగించనున్నారుఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయివాహనసేవల్లో స్వామిఅమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారుదేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.


ఆలయ నేపథ్యం :  ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన తిరుమలయ్య పునరుద్ధరించినారుప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన  గుడిగోపురాలను పునర్నిర్మించి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిత్యపూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలుఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి, 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోందిఅర్చకులు సుందరాజ స్వామివారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానములు వారు చేపట్టి శ్రీవైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణభక్తులకు వసతులునిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణంసాక్షాత్కారబ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారునంవబర్ 2007లో మహా సంప్రోక్షణ అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించింది.


బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం గం. నుండి 9 గం. వరకురాత్రి 7 – 8 గం. వరకు స్వామివారు వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


08-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం. 8.15 నుండి 8.35 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


09-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


10-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


11-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


12-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం


13-02-2026


ఉదయం – హనుమంత వాహనం


మధ్యాహ్నంవసంతోత్సవం (. 2 నుండి 3 గంటల వరకు)


సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)


రాత్రి – గజ వాహనం


14-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


15-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


16-02-2026


ఉదయం – చక్రస్నానం(. 9.55 నుండి 10.15 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్ ప్రాజెక్ట్అన్నమాచార్య ప్రాజెక్ట్  ఆధ్వర్యంలో కళాకారులు ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలనుఅన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.


No comments :
Write comments