1.2.26

ఫిబ్రవరి 2న పేట ఉత్సవం peta utsavam




తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2 తేదీన కూపుచంద్రపే గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.


శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారుఅనంతరం స్వామిఅమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారుసాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించితిరిగి ఆలయానికి చేరుకుంటారు.


ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా  ఉత్సవాన్ని నిర్వహిస్తారుఉదయంసాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలుకోలాటాలు నిర్వహించనున్నారు.


No comments :
Write comments