10.2.26

చెన్నైలో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సింహ వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు ammavari brahmotsavalu





తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నెల 07 తేదీ నుండి 16 తేదీ రకు చెన్నైలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాలలో సోమవారం (09 తేదీఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై విహరించి భక్తులకు అనుగ్రహించారు. రాత్రి సింహ వాహనంపై విహరిస్తారు.


శ్రీ పద్మావతీ అమ్మవారు ఉదయం 09గం.లకు రాత్రి 07 గం.లకు పలు వాహనాలపై విహరించి భక్తులకు అనుగ్రహించనున్నారు.


వాహన సేవల వివరాలు


ఫిబ్రవరి 10 తేదీ ఉదయం కల్పవృక్ష వాహనంరాత్రి హనుమంత వాహనం

ఫిబ్రవరి 11 తేదీ ఉదయం  పల్లకీ ఉత్సవంరాత్రి  గజ వాహనం

ఫిబ్రవరి 12 తేదీ ఉదయం సర్వభూపాల వాహనంరాత్రి గరుడ వాహనం

ఫిబ్రవరి 13 తేదీ ఉదయం సూర్య ప్ర వాహనంరాత్రి చంద్ర ప్రభ వాహనం

ఫిబ్రవరి 14 తేదీ ఉదయం 8.30 గం.లకు రథోత్సవంరాత్రి అశ్వవాహనం

ఫిబ్రవరి 15 తేదీ ఉదయం 11 గం.కు చక్ర స్నానంరాత్రి 7.30 ధ్వజావరోహణం

ఫిబ్రవరి 16 తేదీ సాయంత్రం 06 గం.లకు పుష్పయాగం జరుగనుంది.

 

బ్రహ్మోత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.


 కార్యక్రమంలో ఏఈవో శ్రీ ధనంజయసూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలతఅర్చకులుభక్తులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments