16.2.26

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు chariot








శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌దేవిభూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు ర్శనమిచ్చారు.


ఉదయం 7.45 గం.లకు శ్రీ‌దేవిభూదేవి స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో  ప్రారంభమైందివేద మంత్రోచ్చారణలుమంగళ వాయిద్యాలుగోవింద నామస్మరణల మధ్ స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగిందిరథోత్సవం సందర్భంగా భక్తుల సందడివిశ్వాసంఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి.


 “గోవిందా… గోవిందా…” అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని లాగిన భక్తులు,  తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారుదేవదేవుడి దివ్య దర్శనం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగిందిభక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించిమోక్షం లభిస్తుందిరథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.


రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ర‌థోత్స‌వంలో ఎస్ఇ శ్రీ మ‌నోహ‌రం,  ఆలయ ప్రత్యేక అధికారి మ‌రియు సిపిఆర్వో డాటి.రవిప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మివీజీవో శ్రీ సురేంద్రఏఈవో శ్రీ గోపినాథ్‌కంకణభట్టర్  శ్రీ బాలాజీ రంగాచార్యులుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌న శేఖ‌ర్‌ఆలయ అర్చకులుఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఫిబ్ర‌వ‌రి 16 చక్రస్నానం :


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన సోమవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుందిఇందులో భాగంగా ఉదయం 9.00 గం. నుండి 09.55 గం. మధ్య వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఅనంతరం ఉద‌యం 9.55 గం.లకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం రుగనుంది.


No comments :
Write comments