26.2.26

నకిలీ వెబ్‌సైట్ల తో అప్రమత్తంగా ఉండాలి అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలి : టీటీడీ fake websited




తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తున్న దళారులునకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అప్రమత్తమైందికేరళకు చెందిన భక్తుడు శ్రీ సి.కెసురేష్ బాబు తిరుమలలో “కర్ణాటక ప్రవాసి సౌధ” పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి చేత మోసపోయిన ఘటనపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలోటీటీడీ విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది.


విచారణలో తిరుమల శ్రీవారి ఆలయ చిత్రాలుటీటీడీ పేరును అనధికారికంగా వినియోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించారుగూగుల్ సెర్చ్‌లలో  ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తూభక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తేలింది.


 నేపథ్యంలోనకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు టీటీడీ ఐటీ విభాగం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందిఅలాగేటీటీడీ చిహ్నాలుఆల చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేయడం జరిగింది.


దర్శనంవసతి గదులుసేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే మాత్రమే బుకింగ్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.


భక్తులు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలనిఅనుమానాస్పద వెబ్‌సైట్లుఫోన్ కాల్స్‌ను వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని కోరడమైనది.


No comments :
Write comments