20.2.26

శ్రీవారి సేవలో పరిమళిస్తున్న పుష్పాలు flowers








పురాణాల్లో పుష్ప మండపంగా పిలువబడిన కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి పుష్ప కైంకర్యానికి విశేష ప్రాధాన్యత ఉందిప్రపంచంలో ఎక్కడాలేని విధంగా నభూతో  భవిష్యత్ అన్న చందంగా తిరుమలలో స్వామివారికి అనునిత్యం పుష్ప కైంకర్యాలు నిర్వహిస్తుంటారుఅంతటి ప్రాముఖ్యత కలిగిన పుష్ప కైంకర్యాలకు నిర్విఘ్నంగా పుష్పాలను సరఫరా చేస్తూ స్వామివారి పుష్ప కైంకర్యాలకు టీటీడీ ఉద్యానవన విభాగం వెన్నుముకగా నిలుస్తోంది.


తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగం 1991 నుండి తిరుమలతిరుపతిలోని ఉద్యానవనాల అభివృద్ధిసంరక్షణతో పాటు శ్రీవారి ఆలయానికి అవసరమైన పుష్పాల సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది.


తిరుమలతిరుపతిలో కలిపి మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో భక్తిప్రకృతి సౌందర్యాల సమ్మేళనంతో టీటీడీ ఉద్యానవనాలు విస్తరించి ఉన్నాయిఇందులో 54 ఎకరాలు అలంకార ఉద్యానవనాలుమిగిలిన 7 ఎకరాలు పుష్పోత్పత్తి తోటలుగా వినియోగంలో న్నాయితిరుమలలో ఏడాదికి దాదాపు 450కు పైగా ఉత్సవాలు,  వైదిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్ నేపథ్యంలోపుష్పాల అవసరం భారీ స్థాయిలో ఉంటుంది.


శ్రీవారి ఆలయంఉప ఆలయాలకు సంవత్సరానికి సుమారు 2.60 లక్షల నుంచి 2.70 లక్షల కిలోల పుష్పాలు వసరమవుతుండగాప్రతిరోజూ నిత్య ధూపదీప నైవేద్యాలకు సగటున 300 కిలోల పుష్పాలు వినియోగిస్తున్నారు.


తిరుపతిలోని స్థానిక ఆలయాలుబయటి దేవాలయాల అవసరాలకు అదనంగా సంవత్సరానికి సుమారు 3 లక్షల కిలో పుష్పాలు సరఫరా అవుతున్నాయి.


 నేపథ్యంలో దేశవిదేశాల నుండి పుష్పాలను సేకరించడంతో పాటు ఎప్పటికప్పుడు పుష్పాలను సరఫరా చేసేందుకు శ్రీవారి పుష్ప కైంకర్యంలో టీటీడీ ఉద్యానవన విభాగం విశేష కృషి చేస్తోంది.


బ్యాంకాక్మలేషియాఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల నుండి కూడా నాణ్యమైన పుష్పాలను సేకరిస్తూ టీటీడీ ఉద్యానవన విభాగం స్వామివారి కైంకర్యాలకు పుష్పాలను సరఫరా చేస్తోంది.


ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి 16 నుండి 18 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను సేకరించడం జరుగుతోందిఆరోజున స్వామివారికి ప్రతిరోజూ సమర్పించే అన్ని రకాల పుష్పాలుపత్రాలను దాదాపు 10 టన్నులు సేకరించి పుష్ప కైంకర్యం చేసేందుకు టీటీడీ ఉద్యానవన విభాగం కీలక పాత్ర పోషిస్తోంది.


టీటీడీ మూడు మార్గాల్లో పుష్పాలను సమకూర్చుకుంటోందిటీటీడీ సొం పుష్ప తోటలుభక్తుల విరాళాలు మరియు రిజిస్టర్డ్ రైతు సంఘాల ద్వారా కొనుగోలు చేసి పుష్పాల రఫరా నిర్వహిస్తున్నారుఇదే విధంగాతిరుమలతిరుపతి పరిసరాల్లోని అలంకార ఉద్యానవనాలుసర్కిళ్ల సంరక్షణలో దాతల పాత్ర విశేషంగా ఉందిమొత్తం 20 ప్రాంతాల్లో దాతల సహకారంతో ఉద్యానవనాల సంరక్షణ జరుగుతుండగాఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో మరో 16 ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నిర్వహణ చేపడుతున్నారుగీతోపదేశం పార్క్, నామాల పార్క్గరుడ సర్కిల్లేపాక్షి సర్కిల్శ్రీవారి పుష్ప ఉద్యానవనం వంటి ప్రాంతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రకృతి అందాలతో కూడిన ఉద్యానవనాలను పరిరక్షిస్తూ, భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తూ టీటీడీ ఉద్యానవన విభాగం ఆదర్శంగా నిలుస్తోంది.


No comments :
Write comments